Saturday, 18 April 2026 02:16:06 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’..

జర్నలిస్టులకు ‘సోయి’ లేదు సరే మరి క్యాంపు రాజకీయాలు 'ఏ సోయి' లోకి వస్తాయి.!?’ అర్ధరాత్రి పోలీసులతో బెదిరింపులు... : ఈదేనా..‘సోయి రాజకీయం

Date : 04 March 2026 01:59 AM Views : 913

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ మార్చి 03 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) పాలమూరు రాజకీయాల్లో ‘మర్రి చెట్టు’ నీడన చిన్న మొక్కలు పెరగవు అనే నానుడిని నిజం చేస్తూ, జిల్లా కాంగ్రెస్‌లో ఒక బీసి యువ నేత ఎదుగుదలను అణచివేసేందుకు పక్కా స్కెచ్ అమలైందా? మాజీ చైర్మన్ ఆనంద్ గౌడ్ రాజకీయ భవిష్యత్తుపై ‘శకుని’ రాజకీయాలు చేసి, ఒక వర్గం నేతలు విజయోత్సవం జరుపుకుంటున్నారా.? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. శంషాబాద్‌లోని ‘క్లార్క్స్ ఇన్ సూట్స్’ హోటల్‌లో అర్ధరాత్రి పూట సాగిన తంతు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. *అర్ధరాత్రి పోలీసులతో బెదిరింపులు... 3 బస్సులతో క్యాంప్‌లు : ఈదేనా..‘సోయి’ గల రాజకీయం.?.!* నిజాలను నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టులకు ‘కామన్ సెన్స్’, సోయి వుందా.? సోయి వుందా.? సిగ్గుపడాలి .. సిగ్గు పడాలి అంటూ విమర్శిస్తున్న నేతల తీరుపై "సోయి ఉన్న మీడియా" లోకం భగ్గుమంటోంది. ఫలితాలు రాగానే అభ్యర్థులను అర్ధరాత్రి బస్సుల్లో క్యాంప్‌లకు తరలించడం వెనుక ఉన్నది ఏ ‘సోయి, ఏ సెన్స్’? అర్థరాత్రి ఆనంద్ గౌడ్ రూమ్ నం 916 గదిలో పోలీసులతో రెక్కి నిర్వహించి, సోదాలు జరిపించి ఆయన్ను నిర్బంధించి, అభ్యర్థులు మహబూబ్ నగర్ చేరాక విడిపించడం ఏ రకమైన ‘సోయి’కి నిదర్శనం అని జిల్లా ప్రజలు నిలదీస్తున్నారు. "ఆనంద్ గౌడ్ ను అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి సీ ఐ గారు" అని పోలీసులకు పురమాయించిన ఆ ‘పెద్ద మనిషి’ ఎవరో ఓడిపోయిన ( కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడించిన ) అభ్యర్థి ఇచ్చిన ఇంటర్వ్యూతో బట్టబయలైంది. *డ్యామేజ్ కవర్ చేసేందుకు జర్నలిస్ట్ ‘సంక్షేమ’ నాటకాలు!* ఆనంద్ గౌడ్ అరెస్ట్ వ్యవహారం జిల్లాలో పార్టీకి, కొందరు నేతలకు తీవ్రస్థాయిలో డ్యామేజ్ చేయడంతో, ఆ గండం నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు ‘మీడియా మేనేజ్‌మెంట్’ మొదలుపెట్టారు. క్యాంప్ కార్యాలయంలో నిత్యం పైరవీలు చేసే ఒక కోటరీని జర్నలిస్టుల ‘పెద్దన్న’లుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. సంక్షేమ నిధి డ్రామా : జర్నలిస్టుల సంక్షేమ నిధి పేరిట కొత్త నాటకానికి తెరలేపారు. జర్నలిస్టులను బుట్టలో వేసుకుని 95శాతం మందితో 5 శాతాన్నీ కట్టడి చేసేందుకు, మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో తాము చేసిన తప్పిదాలను, మైనారిటీ పట్ల జరిగిన వివక్షత, ఆనంద్ గౌడ్ గ్రాఫ్ ను తగ్గించే వార్తలను సృష్టించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. *రివర్స్ అవుతున్న ‘వైరస్’ రాజకీయం!* ఆనంద్ గౌడ్‌ను రాజకీయంగా తొక్కేయాలని చేస్తున్న ప్రతి ప్రయత్నం ఇప్పుడు ఆయనకు మైలేజీని పెంచుతోంది. "కోట్లలో డబ్బులు పట్టుబడ్డాయి" అని ప్రచారం చేసిన నేతలు, ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎంతగా డ్యామేజ్ చేయాలని చూసినా, అది ప్రజల్లో ఆనంద్ గౌడ్ పట్ల సానుభూతిని ‘వైరస్’లా వ్యాపింపజేస్తోంది. నిశ్శబ్దం వెనుక తుపాను ఉందా? ప్రస్తుతానికి ఆనంద్ గౌడ్ మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన చుట్టూ అల్లిన ఈ రాజకీయ చక్రబంధనాన్ని ఛేదించేందుకు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. " శకుని రాజకీయాల"తో తాత్కాలికంగా గెలిచామని భావిస్తున్న నేతలకు, పాలమూరు ప్రజల మద్దతు ఎవరికి ఉందో త్వరలోనే తేలనుంది. ప్రజా పాలనలో శవాలను కుక్కలు పిక్కుతింటూన్నాయో.. అదే విదంగా "రూ.1200 కోట్ల రూపాయల పై డేగల కన్ను" అనే విషయం పై కూడా సోషల్ మీడియా చలోక్తులు వినిపిస్తున్నాయి...

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :