కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆవరణలో వాసవి క్లబ్ కల్వకుర్తి వాసవి వనిత క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో రెండు లక్షల 50 వేల రూపాయలను ఖర్చు చేసి శ్రీ సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు శుక్రవారం పాఠశాల ఆవరణలో భక్తిశ్రద్ధలతో ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా జరిపారు వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసులు దంపతులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అందరికీ మంచి జరగడంతో పాటు విద్యాబుద్ధులు రావాలనే సంకల్పంతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించామని చెప్పారు వాసవి క్లబ్ వాసవి వనితక్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ పాఠశాల అధ్యక్షులు డాక్టర్ దామోదర్ రెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలురి రమేష్ బాబు, కల్వ మనోహర్, కల్వ హరికృష్ణ, కలిమిచర్ల రమేష్, కలిమిచర్ల గోపాల్ శివ జగదీశ్వర్, కూన చంద్రశేఖర్, జూలూరి సత్యం, చిగుళ్లపల్లి శ్రీధర్ వాసవి వనిత క్లబ్ అధ్యక్షుడు చిదిరి శ్రీలక్ష్మి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కల్వ లక్ష్మీ ఆంజనేయులు, కోశాధికారి దుగ్గి ధనలక్ష్మి అశోక్ కుమార్, కొండూరు కృష్ణయ్య, వీరమల్ల పాండు, చిత్తనూరు భరత్, ఎన్ ఆర్ శ్రీధర్ , శివ రాఘవేందర్ ,పిఎస్ఎన్ గుప్తా సరస్వతి శిశు మందిర్ పాలమూరు విభాగ్ అధ్యక్షులు ఓబుగారి శ్రీనివాసయ్యా, నాగర్ కర్నూలు జిల్లా సరస్వతి విద్యాపీఠం అధ్యక్షుడు శివశంకర్, మురళీధర్ రెడ్డి, గుగ్గిళ్ళ శంకర్, కూన కిషోర్, లక్ష్మారెడ్డి, రాము, సామల రాజేష్, వనంశెట్టీ సురేష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Kalam Power News