Saturday, 13 June 2026 10:33:40 AM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

*బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

*చర్యలు ఎక్కడ..? అధికారుల నిర్లక్షం పై సోషల్ మీడియాలో సెటైర్లు..* *గాలిలొ ప్రజల ప్రాణాలు...

Date : 11 May 2026 08:41 AM Views : 296

కలం పవర్ న్యూస్ - క్రైమ్ / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్, మే 11 ( కలం పవర్ బ్యూరో ) : మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల రహదారుల పై ప్రమాదాల వల్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి... ఆది వారం రాత్రి మహబూబ్‌నగర్ పాలకొండ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంతో దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ ఓ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు కారులో ఉన్న ముగ్గురు , అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్య డ్రైవింగ్ ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. యువకుల నిర్లక్ష్యపు బైక్ రేసింగ్ సరదా ఐదుగురు అమాయకుల ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాను విషాదంలో ముంచెత్తింది. పాలకొండ బైపాస్ రోడ్డుపై అత్యంత వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్ బైక్ కారు ఢీకొనడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు. ఈ ఘటనతో మహబూబ్‌నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డుపై రాత్రివేళల్లో జరుగుతున్న బైక్ రేసింగ్‌లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బైపాస్‌ను బైక్ రేసర్ల అడ్డాగా మార్చేశారని ఆరోపిస్తున్నారు. “ప్రతి రోజు రాత్రి స్పోర్ట్స్ బైక్‌లతో యువకులు బైపాస్‌పై రేసింగ్‌లు చేస్తుంటారు… చెవులు పగిలేలా శబ్దాలు చేస్తూ ప్రాణాలతో ఆటలాడుతుంటారు… పోలీసులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాలకొండ బైపాస్ రోడ్డుపై కొంతమంది యువకులు నిత్యం స్పోర్ట్స్ బైక్‌లతో రేసింగ్‌లు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బైక్ స్టంట్లు, అతి వేగంతో రేసులు పెరిగిపోవడంతో సాధారణ ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారని చెబుతున్నారు. ప్రజలు ప్రయాణించే ప్రధాన రహదారిని రేసింగ్ ట్రాక్‌లా మార్చడం వల్ల అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొండ బైపాస్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వేగ నియంత్రణ చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సీసీ కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, పోలీసు నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “పాలమూరు బైపాస్‌లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా గట్టి చర్యలు కనిపించడం లేదు” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. “ఒక్కరి నిర్లక్ష్యం… ఎన్నో కుటుంబాల జీవితాలను చీకటిలోకి నెట్టింది” అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఫ్రెష్ మీట్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి డివైడర్ ను ఏర్పాటు చేశారు కాని ఇందులో ఫ్రెష్ మీట్ అనే వ్యాపార సంస్థకు అనుకూలంగా వుండడం కోసమే ఈ స్థలంలో డివైడర్ ను ఏర్పాటు చేశారు అని ఆరోపణలు వచ్చాయి.

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :