Friday, 19 June 2026 01:12:21 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం..

Date : 06 October 2024 07:38 PM Views : 1092

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో నాల్గవ రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. సకల భువన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీ దేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈ దేవిని "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుడి అంకం అమ్మకు ఆసనం. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. దేవాలయం లో ఉదయం నుండి ప్రాతః కాల పూజలతో మొదలుకొని అభిషేకము, ప్రత్యేక అలంకరణ గావించి దంపతులచే రెండు పర్యాయాలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. కుంకుమార్చన లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా, లలితా సహస్ర నామాలు మరియు వేద పండితులచే వేద పఠనం చేయడం జరిగింది. *ముఖ్య అతిథిగా తల్లోజు ఆచారి హాజరయ్యి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.* అనంతరం సాంస్కృతిక వినోద కార్యక్రమాలు, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ మరియు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. సాయంత్రం బతుకమ్మ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. బతుకమ్మ పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బతుకమ్మ పాటలతో, దండియా కొలాటాలతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. *దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన* ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్, అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :