కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణానికి ఆమోదముద్ర వేస్తూ శుక్రవారం G.O విడదల చేశారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సరిత తిరుపతయ్య ముఖ్యమంత్రిని కలిసి యొక్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ గద్వాల నియోజకవర్గానికి కేటాయించాలని వినతి పత్రం ద్వారా కోరగా, వెంటనే అంగీకరించిన ముఖ్యమంత్రి స్పందించి గద్వాలకు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ శని వారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఇసాక్ సీనియర్ నాయకులు అమరవాయి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు, పెద్దోడి రామకృష్ణ, పెద్దపల్లి రాజశేఖర్ , భాస్కర్ యాదవ్ మాజీ కౌన్సిలర్, మహేష్ కుమార్ కౌన్సిలర్ ,లత్తిపురం వెంకటరామిరెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ , శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాల మహానాడు శ్రీనివాస్ , కిఫిఫాతుల్లా మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు, కౌసర్ బేగ్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, ఆనంద్ గౌడ్, ఎంఏ ఇలియాస్ గోపాల్, సమీ ఉల్ల్లా పర్శరామ్ ,27 వ వార్డు బంగి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News