కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి దేవాలయం కల్వకుర్తి లో తేది 03-10-2024 నుండి 13-10-2024 వరకు ఉత్సవాలు జరగనున్నాయి... పది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు సహకరించే దాతలు మరియు కార్యక్రమాల వివరములు పుస్తకంలో పొందు పరచడం జరుగుతుంది. దేవాలయ ట్రస్ట్ ఛైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో తేదీ 01-10-2024 మంగళవారం ఉదయం 10గంటలకు పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్షులు నారాయణ రాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, గంధం ప్రసాద్, సంబు ముత్యాలు, వాస శేఖర్, జూలూరి వీరెష్, దుగ్గి వెంకటేష్, కంది ప్రవీణ్, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్ళ పల్లి శ్రీధర్, కొండూరు కృష్ణయ్య, గుగ్గిళ్ల శంకర్, పోల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News