కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మున్నభాష ఆదేశానుసారం గద్వాల మండల అధ్యక్షులు ఎండి రఫీ ఆధ్వర్యంలో అశ్వఖుల్లా ఖాన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఎండి రఫీ మాట్లాడుతూ మన పూర్వీకులు మన దేశ స్వతంత్రం కోసం ఎన్నో త్యాగలు చేసినా ప్రభుత్వాలు వాటిని గుర్తించడం లేదని, ముస్లిం సామాజిక వర్గం ఎన్ని త్యాగాలు చేసిన వాటికి ప్రాచుర్యం లేక మరుగున పడిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. ముస్లిం సామాజిక వర్గం కూడా వాటిని ప్రచారం చేయక ఉనికిని కోల్పోయే అవకాశం ఉందని దేశం కోసం మిగతా సామాజిక వర్గాలు ఎలా త్యాగాలు చేశాయో ముస్లిం సామాజిక వర్గం కూడా అంతే త్యాగాలు చేసింది కానీ వాటికి ప్రచారం లభించడం లేదు ఇది ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న సోమరిపోతు తనానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఫారూఖ్ మాజీ కౌన్సిలర్ అన్వర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Admin
Kalam Power News