కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : మూసాపేట ఎస్సైగా సుజాత పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మూసాపేట గ్రామ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై సుజాత మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలు కాపాడుతానని చెప్పారు, ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రాంగ్ రూట్లో వాహనాలు నడప రాదని మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కె నారాయణ ,తిరుపతయ్య గౌడ్, శ్రీనివాస శర్మ, గడ్డం మహేందర్, సలాం ఎస్కే పాషా , ఖాదర్, ఖలీల్, నజీర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Kalam Power News