Friday, 19 June 2026 01:25:18 PM
# *బైపాస్‌పై బైక్ రేసింగ్ బీభత్సం.. అమాయకుల ప్రాణాలు బలి* - *వేగం.. మద్యం.. నిర్లక్ష్యం* - పాలకొండ బైపాస్‌లో ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి # *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్

చిన్న పిల్లల్లోనే దేవుణ్ని చూస్తా.. • వారి సేవ కోసం ఏదైనా చేస్తా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Date : 21 September 2024 04:43 PM Views : 980

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : తాను చిన్న పిల్లల్లోనే దేవుడ్ని చూస్తానని, వారి కోసం ఏదైనా చేస్తానని ఎంత సమయమైనా కేటాయిస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులకు బూట్లను ఇస్తున్నామని, వచ్చే ఏడాది బూట్లతో పాటుగా స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కూడా ఇస్తామని ప్రకటించారు. మిడ్జిల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శనివారం బూట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, దిగువ మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి, తమ ఆస్తులను అమ్ముకొని తమ పిల్లలను ప్రైవేటు స్కళ్లలో చదివిస్తున్నారని చెప్పారు. అయితే ఆర్థిక స్థోమత లేని నిరుపేద తల్లిదండ్రులే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థుల కాళ్లకు చెప్పులు కూడా లేకుండా మండు టెండలో నడవడం చూసానని, ఆ సమయంలోనే వారందరికీ షూ లను ఇస్తానని హామీ ఇచ్చానన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ప్రస్తుతం జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సుమారు 27 వేల మంది విద్యార్థులకు బ్రాండెడ్ షూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత నిధులతోనే విద్యార్థులకు షూలను అందిస్తున్నట్లు అనిరుధ్ రెడ్డి గుర్తు చేసారు. వచ్చే ఏడాది నుంచి షూలతో పాటుగా స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లను కూడా ప్రతి విద్యార్థికీ అందజేస్తామని ప్రకటించారు. ఇటీవల జరిగిన హిందూ, ముస్లిం పండులకు తాను హాజరు కాలేకపోయిన విషయాన్ని తమ పార్టీ నాయకుడు ఒకరు అడిగారని తెలిపారు. వ్యక్తిగతమైన సమస్యల కారణంగా తాను దేవుడి ప్రదర్శనల్లో పాల్గొనలేకపోయానని వివరించారు. అయితే చిన్న పిల్లల్లో దేవుడు ఉంటాడని తాను నమ్ముతానని, చిన్న పిల్లల్లో తాను దేవుడ్ని చూస్తానని వివరించారు. చిన్న పిల్లల సేవ కోసం తాను ఏదైనా చేస్తానని, ఎంత సమయమైనా కేటాయిస్తానని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలోని పిల్లలకు మంచి చదువులు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తననియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన భవనాలు, తాగు నీరు, తరగతి గదులు, ప్రహారీ గోడలు వంటి అన్ని మౌలిక వసతుల కల్పనల కోసం ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరానని, దీని కోసం ఎన్ని కోట్ల రుపాయలు అవసరమైనా తాను మంజూరు చేయించుకువస్తానని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. కాగా శనివారం నాడు మిడ్జిల్ మండలంలోని దోనూర్, వల్లభరావు పల్లి, అయ్యవారిపల్లి, వాడ్యాల, వేముల, మిడ్జిల్, బోయిన్ పల్లి కి చెందిన విద్యార్థులకు షూలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాజు నాయక్, ఎంఇఓ ఎంఇఓ మంజులాదేవి, నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు శివకుమార్, మిడ్జిల్ మండల కాంగ్రెస్ నాయకులు అల్వాల్ రెడ్డి, రాజారెడ్డి తదితరనాయకులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: