కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : గణిత శాస్త్ర రంగంలో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని సాధించుకున్న మేధావి శ్రీనివాసా రామానుజన్ 137 వ జయంతి వేడుకలు శనివారం దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి లో ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన గణిత శాస్త్ర వేత్త శ్రీనివాసన్ రామానుజన్ చిత్ర పటానికి ఉపాధ్యాయులు,విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చతుర్విద ప్రక్రియలకు సంబంధించిన కూడిక ( ప్లస్ ), తీసివేత( మైనస్) , గుణకారం ( మల్టిఫికేశన్), బాగాహారం ( డివిజన్) ల ఆకారంలో విద్యార్థులు కూర్చొని అందరినీ ఆకట్టుకున్నారు. ఉన్నత పాఠశాల కు చెందిన గణితం స్కూల్ అసిస్టెంట్ కోటకద్ర మురళీధర్ ను శాలువ, పూల మాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయుడు అశ్విని చంద్ర శేఖర్ మాట్లాడుతూ గణిత శాస్త్ర వేత్త శ్రీనివాసన్ రామానుజన్ జీవిత చరిత్ర, గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ‘బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్ బై రీసెర్చి’ అవార్డును అందుకున్న గొప్ప వ్యక్తి భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ అయ్యంగార్ అని కొనియడారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ ఎం కె కె శ్రీనివాస్, ఉపాధ్యాయులు నాగేశ్వర్ రెడ్డి,మదన్ మోహన్ , చంద్ర శేఖర్, విజయ లక్ష్మీ , సుజాత, పాఠశాల ,విద్యార్థులు పాల్గోన్నారు.
Admin
Kalam Power News