కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : వాసవి క్లబ్ అధ్యక్షునిగా బాదాం రాఘవేందర్ వాసవి క్లబ్ కల్వకుర్తి 2025 అధ్యక్షునిగా బాదం రాఘవేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వాసవి క్లబ్ భవనంలో వాసవి క్లబ్ సభ్యులు సమావేశమయ్యారు ఈ సమావేశానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు జూలూరు రమేష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాబోయే సంవత్సరానికి బాదం రాఘవేందర్ ను ఏకగ్రీవంగా క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ సామాజిక సేవలో వాసవి క్లబ్ల పాత్ర ఎంతో గొప్పదన్నారు వచ్చే సంవత్సరం మరిన్ని సామాజిక సేవలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని జూలూరు రమేష్ బాబు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా బాదం రాఘవేందర్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ,అడిషనల్ ట్రెజరర్ కల్వ హరి కృష్ణ, ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్మచర్ల రమేష్, కోశాధికారి శివ జగదీశ్వర్ అదనపు ప్రధాన కార్యదర్శి చిగుల్లపల్లి శ్రీధర్, క్లబ్ అధ్యక్షుడు చిదిరే శ్రీనివాస్, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి అశోక్, ఇరివెంటి రమేష్, జూలూరు సత్యనారాయణ తదితరులతోపాటు పలువురు పాల్గొన్నారు.
Admin
Kalam Power News