కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : పట్టణంలోని రాజీవ్ మార్గ్ దగ్గర ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ, జయంతి సందర్భంగా రాజీవ్ మార్గ్ లోని ఆయన విగ్రహానికి గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి ) పూలమల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి ఆంజనేయులు (అంజి) మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కృషి మరువలేనిదని నేటి యువతకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తి దాయకం ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు (అంజి) తో పాటు స్వామినాయుడు, న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు, నెంబర్ నరసింహ,వెంకటేష్, సంఘాల వీరేష్, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News