కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో అక్రమంగా అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఐస్క్రీమ్ కేంద్రాలను నిర్వహిస్తున్నారని మున్సిపల్ కౌన్సిలర్ బాలు నాయక్ ఆరోపించారు. చిన్నారులు ప్రజల ఆరోగ్యాలతో ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల నిర్వాహకులు అటలాడుకుంటునారు. ఐస్ క్రీమ్ ల తయారీ నిబందలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ బాలు నాయక్ ఆరోపిస్తున్నారు. పిల్లలు పెద్దలు ఐస్ క్రీమ్ లను అమితంగా ఇష్టపడతారు. వారి అలవాటు ను ఆసరాగా చేసుకొని ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటూ ప్రజలకు, చిన్నారులకు అనారోగ్యాలను అంటగడుతున్నారు.మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా యదేచ్చగా నిర్వహిస్తున్న ఐస్ క్రీం తయారీ కేంద్రాల వైపు మున్సిపాలిటీ అధికారులు కన్నెత్తి చూడలేని స్థితిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఐస్ తయారీలో కనీసం స్వచమైన నీటిని వాడడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు స్వచమైన తాగు నీటి నీ అందించాలని ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్ల నీళ్ళు పక్క దారి పడుతున్నాయి. గృహ అవసరాలకు వాడవలసిన తాగు నీరు ఐస్ క్రీం తయారీ కేంద్రాలలో వాడడం ఏంటని పలువురు కౌన్సిలర్ లు ప్రశ్నిస్తున్నారు. ఐస్ క్రీం తయారీ కేంద్రానికి మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఎలా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయం కు సమీపంలో, మరియు గాంధీ నగర్, నిర్మల విద్యాలయ సమీపంలో నడుస్తున్న అనుమతులు లేని ఐస్ క్రీమ్ తయారీ కేంద్రాల పై జిల్లా అధికారులకు పిర్యాదు చేస్తానని ఆయన అన్నారు.
Reporter
Kalam Power News