కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూ బకాసురులను కబ్జా కోరులను ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేదే లేదని చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలో భూ ఆక్రమణలపై చర్యలు తీసుకొని భూములను కాపాడాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ను కోరారు. అనంతరం కలెక్టరేట్ కార్యలయం ఆవణలో యెన్నం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని గుర్తించి అందుకు కారణమైన వారిని శిక్షించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు. ఫోర్జరీ పట్టాలు సృష్టించి డబుల్ బెడ్ రూము ఇండ్లు అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నియోజకవర్గంలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను విడిపించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తానని తెలిపారు. తన హాయాయంలో ప్రభుత్వం పరిధిలోకి వచ్చేది ఏదైనా ఏ ఒక్కరికో ఇద్దరికో ఒక కుటుంబానికి లాభం కలిగించే విధంగా పనిచేయడం జరగదని అందుకు తమ ప్రభుత్వం కూడా సహకరించదని వెల్లడించారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఆర్డిఓ, తహసిల్దార్లకు ఆదేశాలు జారీ చేశారని ఇంకా ఏవైనా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఆరోపణలు, కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలు ప్రజలు గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే అందుకు కారకులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకూడదనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2014 నుంచి ఇప్పటిదాకా పట్టణంలోని ఓపన్ భూములను రీ వెరిఫై చేసి కబ్జాకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ను కోలినట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా మీడియా సెల్ కన్వీనర్ సి జే బెనహర్, మల్లేపోగు ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
Admin
Kalam Power News