కలం పవర్ న్యూస్ - తెలంగాణ / ముసాపెట్ : పేదల సంక్షేమమే కాంగ్రెస్ ద్యేయమని ప్రజలకు అందుబాటులోకి వెళ్లి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రజా పాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప సర్పంచ్ తాజుద్దీన్ అన్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పనులను విస్మరించారని కొత్తరేషన్ కార్డులు కుడా ఇవ్వకుండా ప్రజలను కల్లిబొల్లి మాటలు చెప్పారన్నారు. కాబట్టి ప్రజలు ప్రజాపాలనకు పట్టం కట్టారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి ప్రధమ చికిత్స చేయడానికి మెడికల్ క్యాంపు ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కావలి నారాయణ, బిలోచి ఖాదర్, ఎస్కే పాషా, సలాం, శెట్టి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Kalam Power News