కలం పవర్ న్యూస్ - తెలంగాణ / పాలమూరు : రాజాపూర్ మండల కేంద్రంలో కొత్తగా వెలసిన మద్యం దుకాణాల్లో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్న సంబంధిత అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు ఆరోపించారు. ఈ విషయమై సోమవారం నాడు జడ్చర్ల ఎక్సైజ్ శాఖ అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఒక్కో బాటిల్ పై ఐదు రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్కువగా అమ్ముతున్నట్లు వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మద్యం కొనుగోలు చేసిన వారికి బార్ కోడ్ ద్వారా బిల్లులు ఇవ్వాల్సి ఉన్నా మద్యం షాప్ యాజమాన్యం వీటిని ఏమాత్రం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు ఎక్కువ రేటుకు అమ్ముతున్న మద్యం దుకాణాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రాజాపూర్ మండలనికి చెందిన యువకులు బుగ్గయ్య, ఆదిత్య, ప్రభాకర్, శేఖర్, రాము తదితరులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Admin
Kalam Power News