Saturday, 18 April 2026 03:22:33 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

సిఎంఆర్ ఇవ్వని మిల్లులపై పీడియాక్ట్ కేసులు నమోదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి జిల్లా కలెక్టర్

సి ఎం ఆర్ చెల్లింపులో జాప్యం వహించిన మిల్లర్లపై ఆగ్రహాం..!!

Date : 30 December 2023 06:07 PM Views : 1068

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / నాగర్ కర్నూల్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ఎఫ్స సీ ఐ కి సకాలంలో అందించకుండా పెండింగ్ పెట్టుకున్న రైస్ మిల్లర్‌లపైన పీడీ యాక్ట్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కస్టమ్ మిల్లింగ్ రైస్/ సిఎమ్‌ఆర్ డెలివరీ ప్రక్రియ పై మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు సకాలంలో సీఎమ్మార్ అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్న వారి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఆయా రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసి, నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో సిఎమ్‌ఆర్ పెండింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. కల్వకుర్తి శ్రీ లక్ష్మీ వెంకట నరసింహస్వామి పారాబైడ్ రైస్ మిల్ ఇప్పటివరకు ఒక ఏసీకే కూడా ఎఫ్ సి ఐ కి అందించకుండా 13 ఏసీకేలు పెండింగ్లో ఉండడంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సీతారామాంజనేయ ఇండస్ట్రీట్ గుడిపల్లి 162 ఏసీకేలు పెండింగ్ ఉండడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 50% పెండింగ్ ఒకే మిల్లులో ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలు నిర్వహించి ధాన్యాన్ని పరిశీలించాలని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పది రైస్ మిల్లుల వద్ద పెండింగ్లో ఉన్న 324 ఏసీకేలను ఎఫ్ సి ఐ కి అందించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2022-/23 యాసంగి, వానా కాలం సీజన్ కింద 92 వేల 897 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అందించాల్సి ఉండగా 43064 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే ఎఫ్సీఐకి అందించారని, 49833 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇంకా అందించాల్సి ఉందని అందించకపోవడంతో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రానున్న 15 రోజుల్లో 100% ఎఫ్సీఐకి సీఎంఆర్ బియ్యాన్ని అందిస్తామని కలెక్టర్ కు మిల్లర్లు హామీ ఇచ్చారు. ప్రభుత్వం గతంలోని డిసెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించిన విషయాన్ని కలెక్టర్ గుర్తు చేశారు. అధిక శాతం పెండింగ్లో ఉంచుకున్న మిల్లర్ల నుండి ఇతర మిల్లర్లకు వరి ధాన్యాన్ని బదలాయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా సివిల్ సప్లై అధికారి స్వామి కుమార్, డిఎం సివిల్ సప్లై బాల్ రాజ్, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు జూలూరి రమేష్, అసోసియేషన్ కార్యదర్శి రవి కుమార్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :