కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : ఇటీవలి జరిగిన అసెంబ్లి ఎన్నికలలో కల్వకుర్తి ఎమ్మెల్యే గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందిన సందర్బంగా ఎల్లికల్ మాజీ ఉపసర్పంచ్ పంతులు శ్రీకాంత్ సోమ శ్రీశైలం దేవస్థానంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరు మీద భక్తులకు అన్నదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. తన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే గా గెలుపొందడం కోసం కృషి చేసిన ఎఐసిసి సభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, సంజీవ్ యాదవ్, సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ నగర్-2 నవతరంగ్ యువజన సంఘం సభ్యులు గణేష్, అరవింద్, లింగం, సురేష్, అంజి, అజయ్, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News