కలం పవర్ న్యూస్ - రాజకీయం / కల్వకుర్తి : తెలంగాణ మలిదశ ఉద్యమకారులు ప్రస్తుత నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కల్వకుర్తి మున్సిపల్ కౌన్సిలర్లు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో విదేశాల నుండి వచ్చి తెలంగాణ కోసం కల్వకుర్తి నియోజకవర్గం లో ఊరు ఊరా తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసి తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకులలో అత్యంత ముఖ్యుడు ఠాకూర్ బాలాజీ సింగ్. ప్రస్తుత 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయంలో ఎంతో కీలక భూమిక పోషించారు. అలాంటి బాలాజీ సింగ్ కు స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కల్వకుర్తి ప్రజానీకం కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి నాయకత్వం మరియు రాష్ట్రస్థాయి నాయకత్వం ఇట్టి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎట్టి పరిస్థితిలో బాలాజీ సింగ్ కు ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధినాయకత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలు నాయక్, హుమ్లి హనుమా నాయక్, విజయలక్ష్మి, గోరటి శ్రీనివాసులు, రజియా శానవాజ్, లక్ష్మీ చిన్నరామిరెడ్డి,ఏజాస్, చందన శ్రీధర్ రెడ్డి, నీరటి పద్మ, చిన్న మరియు కో ఆప్షన్ సభ్యులు కోట్ల భాగ్యమ్మ, అజ్మాత్, సాబెర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News