మహబూబ్ నగర్ అక్టోబర్ 20 ( కలం పవర్ న్యూస్ ): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలిపారు.

    చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ధర్మం, సత్యం, న్యాయం ఎల్లప్పుడూ విజయం సాధిస్తాయనే గొప్ప సందేశాన్ని దసరా పండుగ అందిస్తుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యత, సోదరభావం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, అభివృద్ధి, సుఖసంతోషాలను తీసుకురావాలని మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజల జీవితాల్లో విజయదశమి కొత్త వెలుగులు నింపాలి  రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి