మిడ్జిల్ అక్టోబర్ 18 ( కలం పవర్ న్యూస్ ) : మహబూబ్ నగర్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్నం సత్యం గుప్తకు మిడ్జిల్లో ఘన సన్మానం నిర్వహించారు. ఆదివారం మిడ్జిల్ గ్రామంలోని ఈదమ్మ తల్లి దేవాలయంలో ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్నం సత్యం గుప్త రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. డీలర్ల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగాలని కోరారు. జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.
Sunder Chary





