Saturday, 18 April 2026 02:27:34 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ ఇద్దరి కలయికతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారా..? ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ : సలార్ మూవీ రివ్యూ :

సలార్ మూవీ రివ్యూ : ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షో...

Date : 22 December 2023 12:13 PM Views : 2056

కలం పవర్ న్యూస్ - సినీమా / హైదరాబాద్ : స‌లార్ మూవీ రివ్యూ - రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్ ఇద్దరి కలయికతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారా..? సలార్ మూవీ రివ్యూ: రెబెల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ రూపొందిన స‌లార్ మూవీ శుక్ర‌వారం ప్రీమియర్ షో, రెగ్యులర్ షో లతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ్రెండ్షిప్ అండ్ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే..! ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల సలార్ : బాహుబ‌లి1-2 ల త‌ర్వాత పాన్ ఇండియ‌న్ లెవెల్‌ స‌క్సెస్ కోసం ప్ర‌భాస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. సాహో నుంచి ఆదిపురుష్ వ‌ర‌కు ప్ర‌భాస్ న‌టించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద అభిమానులను నిరాశ‌ప‌రిచాయి. దింటో స‌లార్‌ సినిమా పైనే ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 స‌క్సెస్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సలార్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది శృతిహాస‌న్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్, జగపతి బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. 2023లోనే మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీగా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నడుమ రిలీజైన స‌లార్ ఎలా ఉంది..? ప్ర‌భాస్‌కు ప్ర‌శాంత్ నీల్ హిట్ ఇచ్చాడా..? లేదా..? అన్న‌ది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే ఆలస్యం ఎందుకు కథ గురించి తెలుసుకుందాము.. ఖాన్సార్ లో ఆధిప‌త్య పోరు : హీరో పాత్ర దేవా ( ప్ర‌భాస్‌) ఓ మెకానిక్‌. అస్సాం ఏరియాలోని బొగ్గు గ‌నుల్లో ప‌నిచేస్తుంటాడు. విదేశాల నుంచి ఇండియాకు వ‌చ్చిన ఆద్య (శృతిహాస‌న్‌) అనే అమ్మాయిని చంప‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తుంటారు. ఆద్య‌ను కాపాడే బాధ్య‌త‌ను దేవా చేప‌డ‌తాడు. దేవా క‌ళ్ల ముందే ఆద్య‌పై ఎటాక్ చేసేందుకు కొంద‌రు రౌడీలు ప్ర‌య‌త్నిస్తారు. హింస‌, గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటాన‌ని త‌ల్లికి (ఈశ్వ‌రీరావు) మాట ఇవ్వ‌డంతో వారిని ఎదురించకుండా మౌనంగా ఉండిపోతాడు దేవా. ఆ రౌడీల‌ను త‌ల్లి కొట్ట‌మ‌ని చెప్ప‌డంతో వారి బారి నుంచి ఆద్య‌ను కాపాడుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది.? ఏలాంటి మలుపు తిరిగింది…ఆద్య‌ను వెంటాడుతోన్న ఖాన్స‌ర్ మ‌నుషుల‌కు దేవాకు ఉన్న సంబంధం ఏమిటి..? ఖాన్స‌ర్‌కు రాజైన రాజ‌మ‌న్నార్ (జ‌గ‌ప‌తిబాబు) కొడుకు వ‌ర‌ద‌రాజ‌ రాజ‌మ‌న్నార్‌కు (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌) ప్రాణ స్నేహితుడిగా దేవా ఎలా మారాడు.? చిన్న‌త‌నంలో దేవా త‌ల్లి కోసం రాజ‌మ‌న్నార్ ఎలాంటి త్యాగం చేశాడు అనేది కథలోని సారాంశం.. జగపతి బాబు కోరిక మేరకు, స్నేహితుల త్యాగానికి ప్ర‌తిఫ‌లంగా మ‌ళ్లీ రాజ‌మ‌న్నార్‌ను దొర‌ను చేయ‌డం కోసం దేవా సాగించిన పోరాటంలో ఎలాంటి మ‌లుపులు తిరిగింది..? ఖాన్స‌ర్ పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం కోసం రాజ‌మ‌న్నార్ కుటుంబంలోనే ఎలాంటి కుట్ర‌లు జ‌రిగాయి..? మ‌న్నార్ తెగ‌పై ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి ఎదురుచూస్తోన్న శౌర్యంగుల తెగ‌కు చెందిన దేవా... రాజ‌మ‌న్నార్‌కు అండ‌గా ఎందుకు నిల‌బ‌డ్డాడు అన్న‌దే స‌లార్ మూవీ క‌థ‌. చిన్ననాటి కథలో ఉగ్రమ్ పోలిక‌లు : స‌లార్ క‌థ చాలా వ‌ర‌కు ప్ర‌శాంత్ నీల్ మొద‌టి సినిమా ఉగ్రమ్‌ ఛాయ‌ల‌తోనే సాగుతుంది. శృతిహాస‌న్ ఎపిసోడ్ మొత్తం ఉగ్రమ్‌ సినిమా నుంచే స్ఫూర్తి పొంది రాసుకున్నాడు ప్ర‌శాంత్ నీల్‌ అని చెప్పవచ్చు. ఖాన్సార్ బ్యాక్‌డ్రాప్‌ను మాత్రం కొత్త‌గా రాసుకున్నాడు. ఖాన్సార్ పీఠం కోసం రాజ‌మ‌న్నార్ ఫ్యామిలీలో అంత‌ర్గ‌త పోరులో బాగంగా రాజ‌మ‌న్నార్ రెండో భార్య కొడుకు, త‌న స్నేహితుడు వ‌ర‌ద రాజ మ‌న్నార్‌ను దొర‌ను చేయ‌డం కోసం ఖ‌న్సార్ సిటీలో అడుగుపెట్టిన దేవా శ‌త్రువుల‌ను చీల్చి చెండాడే యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను హై ఇంటెన్స్‌గా డిజైన్ చేసుకున్నారు ప్ర‌శాంత్ నీల్‌. ఖ‌న్సార్‌ను మూడు తెగ‌లు క‌లిసి స్థాపించాయ‌ని, దేవా...మ‌న్నార్ వంశ‌స్తుల‌కు శ‌త్రువు అయినా శౌర్యంగుల తెగ‌కు చెందిన వాడంటూ క్లైమాక్స్‌లో ఓ ట్విస్ట్ ఇచ్చారు. శౌర్యంగుల‌కు రాజ‌మ‌న్నార్ ద్రోహం చేశాడంటూ చూపించి అంత‌ర్లీనంగా సెకండ్ పార్ట్‌కు సంబంధించిన స్టోరీని ర‌న్ చేశారు. కేజీఎఫ్ ను తలపిస్తోంది : స‌లార్ బ్యాక్‌డ్రాప్‌, యాక్ష‌న్ సీన్స్‌, ఎలివేష‌న్స్, ఖాన్స‌ర్ సెట‌ప్‌...అన్ని కేజీఎఫ్‌1, కేజీఎఫ్ -2ను పోలి ఉంటాయి. హీరో ల‌క్ష్యం, వారి నేప‌థ్యాలు వేరైనా... క‌థనం విష‌యంలో మాత్రం కేజీఎఫ్‌, స‌లార్ ఒకేలా అనిపిస్తాయి. అయితే కేజీఎఫ్ స్థాయిలో ఎమోష‌న్స్ పండ‌లేదనే చెప్పవచ్చు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌ను రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో చూపించాడు దర్శకుడు ప్ర‌శాంత్ నీల్‌. కొడుకు దేవా గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌ని అత‌డి త‌ల్లి ఎందుకు అనుకున్న‌ద‌న్న‌ది సెకండ్ పార్ట్‌లో చూపించ‌డానికి దాచిపెట్టాడు డైరెక్ట‌ర్‌. దాంతో ఫ‌స్ట్ పార్ట్‌లో ఆ సీన్స్ క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తాయి. త‌ల్లికొడుకుల అనుబంధం కేజీఎఫ్ స్థాయిలో వ‌ర్క‌వుట్ కాలేదు. నిడివి కూడా చాలా ఎక్కువ‌గా అనిపిస్తుంది.

సలార్ మూవీ రివ్యూ : ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షో... ప్ర‌భాస్ వ‌న్‌మెన్ షోగానే స‌లార్ నిలుస్తుంది. ప్ర‌భాస్ క‌నిపించే ప్ర‌తి సీన్ ఫ్యాన్స్‌కు విజువ‌ల్ ట్రీట్‌లా కిక్ ఇచ్చేలా ప్ర‌శాంత్ నీల్ జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లో అయితే ప్ర‌భాస్ చెల‌రేగిపోయాడు. ఒక్కో యాక్ష‌న్ ఎపిసోడ్ ఒక్కో క్లైమాక్స్‌లా అనిపిస్తుంది. వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ పాత్ర‌కు పృథ్వీరాజ్ ప్రాణం పోశాడు. ఈ క్యారెక్ట‌ర్‌కు తాను త‌ప్ప మ‌రొక‌రు యాప్ట్ కాద‌ని అనిపించేలా న‌టించాడు. శృతిహాస‌న్ పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదనే చెప్పవచ్చు. ప్ర‌భాస్ త‌ల్లి పాత్ర‌లో ఈశ్వ‌రీరావు మెప్పించింది. జ‌గ‌ప‌తిబాబు, శ్రియారెడ్డి, బాబీసింహా, టీనూ ఆనంద్‌తో పాటు డిఫ‌రెంట్ గెట‌ప్‌ల‌లో క‌నిపించారు ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ : బ్లాక్ బస్టర్ కొసం ఎదురు చూస్తున్న స‌లార్ సినిమా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు పండ‌గ‌లాంటి మూవీ. త‌న లుక్‌, యాక్టింగ్‌, యాక్ష‌న్‌తో అభిమానుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. కేజీఎఫ్‌తో పోలిక లేకుండా చూస్తే సలార్ మెప్పిస్తుంది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమా ఫ‌స్ట్ డే సలార్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మేననిపిస్తోంది…

Sunder Chary

Admin

Kalam Power News

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :